సముద్ర జలాల్లో చమురు అన్వేషణ కోసం ‘సముద్ర మంథన్’ పథకం..
భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో చమురు అన్వేషణకు కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ‘సముద్ర మంథన్’ పేరుతో కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఈ పథకానికి తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. ‘సముద్ర మంథన్’ పథకాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తారు. ఈ పథకం కింద భారత్‌కు హక్కు కలిగిన సముద్ర జలాలు, తీర ప్రాంతాల్లో చమురు అన్వేషణ చేపడతారు.దీని ద్వారా చమురు నిల్వల్ని గుర్తించి, వెలికి తీస్తారు. ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తారు. ఇందుకోసం రూ.84,084 కోట్లు ఖర్చు...