పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వ మారణకాండ..

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీవోజేకే)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్ని అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం అత్యంత కఠినంగా, అమానవీయంగా వ్యవహరిస్తోంది. రావల్‌కోట్‌లో నిరసనకారులపై పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నాలుగు రోజుల్లోనే 42 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. అయితే, ఈ అణిచివేతపై భారత ప్రభుత్వం స్పందించింది. పాక్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించింది.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సామాన్య ప్రజలపై నిర్దాక్షిణ్యంగా బలగాల్ని ప్రయోగించడం సరికాదని భారత్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రపంచం స్పందించాలని, పాక్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార...