రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్-2026 నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈ పంపిణీ కొనసాగుతున్నందున అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.అయితే మూడు నెలల బియ్యం పొందాలంటే రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడి ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారు వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించాలని కోరారు. చిన్నారుల ఈ-కేవైసీని ఐరిస్ (Iris) పరికరం ద్వారా నమోదు చేసే సౌకర్యం...