అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్(Kabaddi Player) షీలూ బల్‌హరా భార్య 23 ఏళ్ల ముస్కాన్ బల్‌హరా ఆత్మహత్య చేసుకున్నది. రోహతక్ జిల్లాలోని బాహూ అక్బార్‌పుర్ గ్రామంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటన పట్ల దర్యాప్తు కొనసాగుతోందని రోహతక్ ఎస్పీ గౌరవ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. కుటుంబసభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. షీలూ బల్‌హరను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. ముస్కాన్ కుటుంబ సభ్యులు షీలూ ఇంటి ముందు ధర్నా చేశారు.