కాక్రోచ్‌లు దేన్నైనా మార్చగలవు
భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన విధ్వంసం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌లో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో యువత ఉద్యమిస్తున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ హోంశాఖ మంత్రి మోషిన్ నఖ్వీ(Moshin Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. యువత తలుచుకుంటే దేన్నైనా మార్చగలరని అన్నారు. వాళ్లు(కాక్రోచ్‌లు) ఐక్యం అయితే ఏదైనా సాధ్యమే అన్న రీతిలో ఆయన స్పందించారు. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థలో సూక్ష్మ స్థాయిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.Executive Branch ప్రస్తుత వ్యవస్థ కుప్పకూలిందని, పెరుగుతున్న దేశ సవాళ్లను ఈ వ్యవస్థ ఎదుర్కొనే సామర్థ్యంలో లేదన్నారు....