శభాష్! బాగా పనిచేస్తున్నావ్.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధానికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన లోకేశ్ భుజం తట్టి.. ‘నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శభాష్ లోకేశ్’ అని ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంపై కూడా ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.