ఇరాన్‌తో యుద్ధం.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్‌

ఇరాన్ (Iran) పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంపై తలపెట్టిన సైనిక దాడి (Strikes On Iran) ప్రణాళికలను రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz) ను తిరిగి పూర్తిగా తెరవడం, ఇరాన్‌ అణు ముప్పును అంతం చేయడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదిత ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మరింత సమయం కావాలని ఇరాన్‌, ఇతర పశ్చిమాసియా (West Asia) దేశాలు కోరినట్లు తెలిపారు. ఒప్పందం వేగంగా ఖరారైతేనే అమెరికా దాడులకు విరామం కొనసాగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో...