వ‌యస్సు పెరిగే కొద్దీ త‌గ్గే మెట‌బాలిజం..

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జీవక్రియల (మెటబాలిజం) వేగం సహజంగానే తగ్గుతుంది. చిన్నతనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం, పెరుగుతున్న వయసులో అంత తేలికగా జీర్ణం కాకపోవడంతోపాటు బరువు కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమి, ధూమపానం, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు కండరాల పరిమాణాన్ని తగ్గించి మెటబాలిజాన్ని మరింత మందగింపజేస్తాయి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా జీవక్రియల వేగాన్ని మెరుగుపరచుకోవచ్చు. కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మెటబాలిజాన్ని పెంచడంలో కొంతవరకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం వల్ల వచ్చే అదనపు బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుందని...