కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి..

కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల భారీ ఆస్తి నష్టం సంభవించింది. రహదారులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇండ్లు ధ్వంసం కాగా.. ఐదు వేల మంది ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా.. ఇంకా పూర్తిస్థాయిలో పరిస్థితులు అదుపులోకి రాలేదు. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ...