‘నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త యువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతలో స్ఫూర్తి నింపేందుకు ఒక సమగ్ర ప్రచారకార్యక్రమంగా ‘నషా ముక్త యువ’ను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. తాముంటున్న ప్రాంతాల్లో సానుకూల మార్పులకు కారకులుగా యువత నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు దేశ యువత ఆరోగ్యంగా ఉండటం అవసరమని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం వ్యక్తులకే కాకుండా కుటుంబాలు, దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని అన్నారు. గతేడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం...