ఇంట్లో దోమల కాయిల్ వాడుతున్నారా?

వర్షాలు మొదలయ్యాక దోమల సంఖ్య పెరగడం సాధారణం. దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్లలో మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్లు ఉపయోగిస్తుంటారు. అయితే దోమలను తరిమే ఈ ఉత్పత్తుల నుంచి వెలువడే పొగ మన ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాయిల్ పొగ ఊపిరితిత్తులకు హానికరం చాలామంది రాత్రి సమయంలో గది తలుపులు, కిటికీలు మూసి దోమల కాయిల్ వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల గదిలో పొగ ఎక్కువగా పేరుకుపోతుంది. కాయిల్ నుంచి విడుదలయ్యే రసాయనాలు గాలిలో కలిసిపోయి శ్వాస ద్వారా శరీరంలోకి చేరుతాయి. దీంతో దగ్గు, గొంతులో చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో అసౌకర్యం వంటి...