విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష..
తమిళనాడులో కావేరి జలాల వివాదం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కర్ణాటకలోని మేకేదాటు ప్రాజెక్టు, కావేరి నీటి విడుదల అంశాల గురించి ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తొలి పెద్ద రాజకీయ పరీక్ష ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు (Cauvery dispute). రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకతో చర్చలు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి, సుప్రీంకోర్టులో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని పార్టీలతో కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే అఖిలపక్ష సమావేశం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.