‘వారణాసి’ కోసం ఐమాక్స్ టెక్నాలజీ ఎందుకు
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని రాజమౌళి తొలిసారి వెల్లడించారు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఓ ప్రముఖ సినీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, ‘వారణాసి’ కథలోని కొన్ని విజువల్ ఎలిమెంట్స్ సాధారణ స్క్రీన్‌పై చూపించడం కంటే ఐమాక్స్‌లోనే ప్రేక్షకులకు పూర్తి అనుభూతిని అందిస్తాయని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఐమాక్స్ సాంకేతికతతో రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు...