కార్చిచ్చును ఆర్పుతూ ఒక‌దానికొక‌టి ఢీకొన్న హెలికాప్ట‌ర్‌లు..

గ్రీస్ (Greece) లో ఘోరం జ‌రిగింది. అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు (Fire Fighting Helicopters) గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు (Two pilots) ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఏథెన్స్‌ (West Athens) లోని పసాతా తీర ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. అటికా-బొయోటియా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు గ్రీస్ ఫైర్ సర్వీస్‌కు చెందిన రెండు ‘బెల్’ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపుచేసే క్రమంలో ఈ రెండు హెలికాప్టర్లు అత్యంత సమీపంలోకి రావడంతో వాటి రోటార్లు (రెక్కలు) ఒకదానికొకటి బలంగా తాకాయి. దాంతో ఒక...