తల్లి కాలు విరిగిందని మనస్తాపం.. ఉరివేసుకుని కుమారుడి బలవన్మరణం

తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్‌పురా కాలనీలో నివాసం ఉండే మహ్మద్ ఇర్ఫాన్ సిద్దికి-అమీనా ఇర్ఫానా దంపతులు. వారికి అబ్దుల్ సలాం సిద్దికి, అబ్దుల్ సమద్ సిద్దికి (16) అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి అమీనా ఇర్ఫానాకు రెండు రోజుల క్రితం చిన్న ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో చిన్న కుమారుడు...