రహానే రిటైర్మెంట్‌తో మొదలైన చర్చ..

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో భారత క్రికెట్‌లో కొత్త చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న రహానే, ఇకపై అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం తర్వాత జట్టుకు దూరంగా ఉన్న మరికొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు భారత టెస్ట్ జట్టుకు కీలక బ్యాటర్‌గా, వైస్ కెప్టెన్‌గా సేవలందించిన అజింక్య రహానే గత మూడేళ్లుగా జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించినప్పటికీ సెలెక్టర్లు అవకాశాలు ఇవ్వకపోవడంతో చివరికి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు...