కోహ్లీ కోపం వెనుక దురుద్దేశం ఉండదు

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో చూపించే ఆవేశం వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండవని మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి స్పష్టం చేశారు. జియోహాట్‌స్టార్ టాక్ షోలో పాల్గొన్న ఆయన, కోహ్లీ లాంటి ఎనర్జెటిక్ ప్లేయర్లు ఉన్నప్పుడే క్రికెట్‌కు అసలైన మజా వస్తుందని పేర్కొన్నారు. 'చిన్నప్పటి నుంచి విరాట్‌కు అంపైరింగ్ చేయడం వల్ల అతని మనస్తత్వం నాకు తెలుసు. కొన్నిసార్లు మైదానంలో చాలా తీవ్రంగా స్పందించినప్పటికీ, మనం సరైన నిర్ణయం ఇస్తే వెంటనే 'థంబ్స్ అప్' చూపిస్తాడు. ఓవర్ల మధ్యలో మా దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. విరాట్ లాంటి క్రీడాకారులు లేకపోతే క్రికెట్ మ్యాచ్‌లు ఎంతో బోరింగ్‌గా మారుతాయి' అని...