పల్నాడు అభివృద్ధికి అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు..

పల్నాడు జిల్లా అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక సాధికారతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ‘క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ ప్రగతిపై సమగ్ర నివేదికను అందజేశారు. జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ప్రధానికి ఎంపీ వివరించారు.పల్నాడు జిల్లాలో 1.03 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,216 కోట్ల మేర రుణాలు పంపిణీ చేసినట్లు మోదీకి కృష్ణదేవరాయలు తెలిపారు. ఇందులో తొలిసారిగా 70 వేల మందికి పైగా లబ్ధిదారులకు రుణ సాయం అందించినట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ...