గచ్చిబౌలిలో చార్మినార్ సెట‌ప్‌..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీ పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చార్మినార్ సెట్ నిర్మిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చార్మినార్ నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరించాలంటే పాతబస్తీ ప్రాంతాన్నే ఎంచుకుంటారు. అయితే ‘ఫౌజీ’ బృందం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి–లింగంపల్లి ప్రధాన రహదారిలోని పాత అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్‌ను తలపించేలా భారీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తోంది. నిజమైన కట్టడాన్ని...