వంశీ పైడిపల్లి సినిమాకు పారితోషికం త‌గ్గించిన‌ స‌ల్మాన్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో నటించేందుకు సల్మాన్ ఖాన్ తన పారితోషికాన్ని (Remuneration) భారీగా తగ్గించుకున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్తలను సినిమా నిర్మాతలు తాజాగా ఖండించారు. ఆ ప్రచారమంతా పూర్తిగా నిరాధారమైనదని స్పష్టం చేశారు. ఇలాంటి ఊహాగానాలపై స్పందించడం కంటే, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అనుభూతిని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని మేకర్స్ పేర్కొన్నారు.