నేలపైనే నిర్లక్ష్యంగా కరెంట్ వైర్లు..
ఝరాసంగం, ఆగస్టు 5 : ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన రైతు బక్కన్న వ్యవసాయ పొలంలో గత నెల రోజుల క్రితం కురిసిన గాలి, వర్షానికి విద్యుత్ వైర్లు తెగి పూర్తిగా నేలపై పడిపోయాయని స్థానిక రైతులు తెలిపారు. విద్యుత్ వైర్లు నేలపై పడిన వెంటనే సంబంధిత లైన్‌మెన్‌తోపాటు ఏఈ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ‘త్వరలో మరమ్మతులు చేస్తాం’ అని చెప్పడం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.