నాకు 8 సెక‌న్‌ల‌లో నిద్ర‌ప‌డుతుంది..

ఎన్డీయే (NDA) నుంచి కొత్తగా రాజ్యసభ (Rajya Sabha) కు ఎన్నికైన ఎంపీలకు ప్రధాని (Prime Minister) న‌రేంద్ర మోదీ (Narendra Modi) పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్‌ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా ఆయ‌న‌ కొత్త ఎంపీలతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National President) నితిన్ నబీన్ (Nitin Nabin) కూడా ఉన్నారు. వ్యక్తిగత ప్రవర్తన సహా రాజ్యసభలో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై వారికి మోదీ దిశానిర్దేశం చేశారు.