యువత, విద్యార్థుల ఆందోళనలపై సంయమనంతో వ్యవహరించాలి..
విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నప్పుడు, అవి ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించి, అణిచివేసే బదులు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు భద్రతా బలగాలకు సూచించింది. వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, వీలైనంతవరకు సంయమనంతోనే వ్యవహరించాలని సూచించింది. జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సంసద్ చలో సందర్భంగా తలెత్తిన ఘర్షణలు, హింస నేపథ్యంలో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, వి మోహన ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఇప్పటికే ఈ అంశంపై దాఖలైన పాత పిటిషన్లతో కలిపి, కొత్త పిటిషన్‌ను కూడా కోర్టు విచారించనుంది. రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి మనీష్...