ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం: గాదగోని రవి

హనుమకొండ, ఆగస్టు 5 (సుదీక్ష న్యూస్): తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు. ప్రగతి సింగారం గ్రామంలో జరిగిన ఎంసిపిఐ(యు) హనుమకొండ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమకొండ నగరంలో వర్షాకాలంలో నీటి నిల్వలు, ఇళ్ల స్థలాలు, మౌలిక వసతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం ప్రభుత్వాల వైఫల్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంసిపిఐ(యు) భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. సమావేశంలో పార్టీ...