‘అనకాపల్లి’ని వినూత్నంగా రిలీజ్ ..
టాలీవుడ్‌లో ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, వాటిలో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘అనకాపల్లి’ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సినిమాలు ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా లేదా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి. కానీ ‘అనకాపల్లి’ చిత్ర బృందం మాత్రం అందుకు భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ సినిమాను అనకాపల్లి ప్రాంతంలో మాత్రమే విడుదల చేసి, అక్కడి ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే ఇతర ప్రాంతాల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ దర్శకుడు నక్కిన త్రినాథరావు కథను అందించడంతో సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి...