అధికారి కుమార్తెను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు, ప్రభుత్వ ఉన్నతాధికారి కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు రెండు రోజుల పాటు దారుణంగా హింసించాడు. బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడి ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేశారు. (Girl Raped By Friend) మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక ఉన్నతాధికారికి చెందిన 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు స్నాప్‌చాట్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారిద్దరూ కమ్యూనికేట్ అయ్యేవారు.కాగా, ఆగస్ట్ 2న స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్‌తో కలిసి మాల్‌కు వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు...