ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత..
ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు ఆలస్యంగా వెల్లడైంది. సరిహద్దులో భద్రతా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమా బల్)కు చెందిన సిబ్బందిపై నేపాల్‌కు చెందిన కొందరు గ్రామీణులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆగష్టు 2న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఇండియా-నేపాల్ సరిహద్దు అయిన బిహార్‌లోని వెస్ట్ చంపారన్ వద్ద ఎస్‌ఎస్‌బీ సిబ్బంది, ఉన్నతాధికారులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 31న సరిహద్దులో నేపాల్ వైపు ఉన్న సుస్తా గ్రామస్తులు మట్టితో ఒక నిర్మాణం చేపట్టారు.అయితే, అది నేపాల్ వైపు నుంచి ఇండియాలోకి వచ్చింది. అంటే, ఇండియా భూభాగంలో ఆ నిర్మాణం చేపట్టారు. దీనిపై ఎస్‌ఎస్‌బీ దళాలు అభ్యంతరం వ్యక్తం...