నేమ్ ఈజ్ నాని - ఏజ్ ఈజ్ 21 : హరిబాబు 'దొంగల ముఠా' లీడర్ అయ్యాడు
21 ఏళ్ల వయసులో ఉన్న యువత సాధారణంగా చదువు, ఉద్యోగమంటూ తల్లిదండ్రులకు పేరు, ప్రతిష్టలు తెచ్చే పనిలో నిమగ్నమవుతారు. అదే వయసులో ఉన్న మరికొందరు మాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడి తప్పుడు మార్గాల్లో వెళుతుంటారు. మంచి, చెడు గుర్తించలేకపోవడం, చెడు స్నేహాలతో జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మేడ్చల్ జిల్లాలోనూ ఓ యువకుడు ఇలాగే నేర బాట పట్టాడు. 21 ఏళ్లకే ఓ ముఠాకు నాయకుడిగా ఎదిగాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, అతని వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ దొంగల ముఠాను నడిపే స్థాయికి ఎదిగాడు. ఇంత చిన్న వయసులోనే అతడి నేర చరిత్ర చూసి...