వరుస సెలవుల ఎఫెక్ట్ - తెలంగాణలో 70 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోతాయి 'సర్'!
తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు తేదీ నాటికి 80 శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 77.86 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను మాత్రమే సిబ్బంది డిజిటలైజేషన్ చేశారు. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, గురువారం సాయంత్రం 6 గంటల వరకు 2,63,37,790 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను మాత్రమే బీఎల్‌వోలు ఆన్‌లైన్ చేశారు. వరుసగా సెలవులు : ఈ నెల 10 వరకు ఎన్యూమరేషన్ పత్రాల ఆన్‌లైన్‌కు సమయం ఉండగా, ఇందులో చివరి మూడు రోజులు రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాల పండగ) సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో పత్రాల సమర్పణలో శుక్రవారం...