'CMR'ను అమ్మేసి స్థిరాస్తుల్లో పెట్టుబడులు : రూ.600 కోట్లు దాటిన రైస్‌ మిల్లర్ల అక్రమాలు

రాష్ట్రంలో రైస్‌ మిల్లర్ల అక్రమాలు రూ.600 కోట్లు దాటాయి. ఒక్కరోజే ఐదు మిల్లుల్లో రూ.106 కోట్ల అవకతవకలు విజిలెన్స్‌ సోదాల్లో బయటపడ్డాయి. సీఎంఆర్ కింద ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి తిరిగి బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లలో కొందరు సరకును అమ్మేసి స్థిరాస్తి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. సోదాలతో హడలిపోతున్న మిల్లర్లు ఆపాలంటూ స్థానిక నేతల ద్వారా ఉన్నతాధికారులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ సోదాలతో వెలుగులోకి వస్తున్న అక్రమాలు : రాష్ట్రవ్యాప్తంగా రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. జులై 20న మొదలైన తనిఖీలు, మధ్యలో రెండు రోజులు మినహా దాదాపు పక్షం రోజులుగా ఏకధాటిగా కొనసాగుతున్నాయి....