మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్..
హైదరాబాద్: మందుబాబులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ షాక్ ఇచ్చారు. బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 9న మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని సీపీ రమేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని సీపీ రమేశ్ పేర్కొన్నారు. రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ప్రజా...