చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, ఆగస్టు 7: చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పీపుల్స్ ప్లాజాలో 100కు పైగా చేనేత స్టాల్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్టు 7 నుంచి 16 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరిస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, వారసత్వానికి చేనేత ప్రతీకన్నారు. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట చేనేతకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. IIHT ద్వారా యువతకు...