డ్రెస్ రంగు గురించి విచిత్రమైన ప్రశ్న.. ప్రియా ప్రకాష్ వారియర్ స్మార్ట్ కౌంటర్‌కు షాక్ అయిన య్యూట్యూబర్!
ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమెను ఉద్దేశించి యూట్యూబర్ అడిగిన వివాదాస్పద ప్రశ్నకు ప్రియా ఎంతో హుందాగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ సంస్థ నిర్వహించిన ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ప్రియా ప్రకాష్ వారియర్ పాల్గొన్నారు. ఆ సంస్థ అధికారిక థీమ్‌కు అనుగుణంగా కాషాయ (సాఫ్రాన్) రంగు దుస్తులు ధరించి వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ యూట్యూబర్,...