వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు అదిరిపోయే ఓపెనింగ్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా సరైన విజయం దక్కలేదు. వరుస సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆయన అభిమానులు కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్‌కు భారీ ఊరటనిచ్చేలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది. సత్య కీలక పాత్రలో కనిపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం ‘కొరియన్...