రాహుల్‌గాంధీ వైఖరి మారినట్లుంది..
మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్ (Ask me Anything)’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలని అన్నారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో ఈ అంశంపై మరింత వివరంగా పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళల్లో ఉన్న శక్తి పూర్తిస్థాయిలో బయటకు రావడం లేదని రాహుల్ అన్నారు. మహిళలు తమకు నచ్చిన విషయాలపై స్వేచ్ఛగా...