బరువు తగ్గించే మసాలా దినుసులు..
బరువు తగ్గాలనుకునేవారు ఆహార నియమాలు, వ్యాయామం, సరైన నిద్ర వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు కూడా శరీర జీవక్రియకు తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసులు ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా, బరువు నియంత్రణకు ఉపయోగపడే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ ఒకేలా ఉండదని, వీటి ప్రభావం వ్యక్తికి వ్యక్తికి మారుతుందని గుర్తుంచుకోవాలి. పసుపు అందరి వంటిళ్లలోనూ సాధారణంగా కనిపించే సుగంధ ద్రవ్యం. ఇది శరీరంలో వేడిని పెంచడం ద్వారా జీవక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు సూప్‌లు, తాజా కూరగాయలు, నట్స్ వంటి...