గొడ్డలి పార్టీ నిరసనల్లో ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థి ఉన్నారా?
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా చేసే నిరసనలను ఏమాత్రం ఉపేక్షించబోమని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్‌లు, రహదారుల వెంట నిరసనలు అంటే ప్రభుత్వం ఊరుకోదని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు.గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థి ఉంటున్నారా? అని సీఎం ప్రశ్నించారు. కర్నూలు నగరంలో ఈ రోజు (శనివారం) కదం తొక్కిన వారంతా మెగా...