డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి

దేశ రాజధానిలో ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. సుమారు 3 వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకోగా.. వారిలో 587 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు ఉన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్‌ గోల్డ్‌ మెడల్‌, డైరెక్టర్స్‌ గోల్డ్‌ మెడల్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ గోల్డ్‌ మెడల్‌ సహా పర్ఫెక్ట్‌ టెన్‌ గోల్డ్‌ మెడల్స్‌ను కూడా ప్రదానం చేశారు మోదీ.