అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ..

సంక్షేమ పథకాల పేరిట విచక్షణ లేకుండా ఉచితాలను విస్తరించట‌మ‌నేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చ‌రించింది. అర్హతలతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై అసహజమైన భారం పడుతోందని పేర్కొంది. కంటోన్మెంట్‌ బోర్డుకు రూ.33.42 కోట్ల బకాయిల చెల్లింపుల విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక శ‌నివారం విచారించారు. హైకోర్టు జారీ చేసిన బెయిలబుల్‌ వారెంట్‌ల నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కోర్టుకు హాజరయ్యారు....