ఆయుధాల కొరతతో ట్రంప్‌ ఆగ్రహం..

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయన్న మీడియా కథనాలు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. ఈ సమాచారం బయటకు రావడంతో అమెరికా బలహీనంగా కనిపిస్తోందనీ, అది ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో తమ బేరసారాల శక్తిని దెబ్బతీస్తోందని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేసినట్టు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని లీక్‌ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయశాఖను ఆదేశించారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం… ఇటీవల క్యాంప్‌ డేవిడ్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారింది. క్షిపణుల నిల్వలు తగ్గుతున్నాయన్న వార్తలపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు...