రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ

కడప మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సంచలన లేఖ రాశారు. ఏడేళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదని పేర్కొన్నారు. 'ఆ నాలుగు కీలక అంశాలపై' దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లవుతున్నా ఇందుకు సంబంధించిన ఆయుధం ఇంకా దొరకలేదని తెలిపారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సునీతారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.