పిల్లలకు చెవులు, ముక్కు కుట్టిస్తున్నారా?
మన దేశంలో పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే పిల్లలకు ఏ వయసులో చెవులు, ముక్కు కుట్టించాలి అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ విషయంలో వైద్యులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సరైన పరిశుభ్రత, భద్రతా చర్యలు పాటిస్తూ చెవులు కుట్టిస్తే వయసు ఒక్కటే పెద్ద సమస్య కాదు. అయితే పిల్లలు తమ చెవులు లేదా ముక్కుకు అయిన గాయాన్ని స్వయంగా శుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే వయసు వచ్చే వరకు వేచి ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సంప్రదాయం లేదా సాంస్కృతిక కారణాల వల్ల కొంతమంది పిల్లలకి పుట్టిన 6 నెలల్లోనే...