మహిళా ఎస్ఐపై దాడి కేసు..

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను ఏపీ పోలీసులు ఈరోజు (శనివారం) అరెస్ట్ చేశారు. చిలకపాలెం వద్ద రవిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఎస్ఐపై దాడి కేసులో అతను ఏ-1గా ఉన్నారు. పది రోజులుగా పోలీసులు కళ్లుగప్పి రవి తిరుగుతున్నాడు. గత నెల 30వ తేదీన మాజీమంత్రి అప్పలరాజు ములాఖత్ కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలతో జగన్‌కు స్వాగతం పాలకటానికి చింతాడ రవి వచ్చాడు.