ఢిల్లీలో రూ.22,000 కోట్ల రైస్ స్కాం..

ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.22,000 కోట్ల విలువైన రైస్ స్కాంకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఆదివారం దీనికి సంబంధించిన ఆరోపణలు చేశారు. పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని, దారి మళ్లించి, భారీ స్కాంకు బీజేపీ సర్కార్ తెరతీసిందని విమర్శించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన ఒక కార్పొరేషన్, ఢిల్లీ ప్రభుత్వం కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి.ప్రభుత్వం, కార్పొరేషన్ కలిసి ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా)కు ఒక లేఖ రాశాయి. ఢిల్లీలోని పేద ప్రజలకు సరఫరా...