మీ వయస్సు 40 దాటిందా..ఈ పరీక్షలు చేయించుకోవాలి..

వయస్సు 40 ఏండ్లకు పైబడిన వారు తప్పనిసరిగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలుచేయించుకోవాల్సి ఉంటుంది. నలభై ఏళ్ల తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. దాంతో ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అయితే 40 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్లడ్ షుగర్ టెస్ట్ ఒకప్పుడు వయస్సు పైబడిన వారు మాత్రమే మధుమేహం బారినపడే వారు. ఇప్పటి ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవనశైలితో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు....