న‌డుము చుట్టుకొల‌త అధికంగా ఉండే మ‌హిళ‌ల‌కు గుండె పోటు ప్ర‌మాదం ఎక్కువ‌..

ఊబకాయం గుండె సంబంధిత అనేక సమస్యలకు కారణమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. అయితే శరీరంలో కొవ్వు ఏ ప్రాంతంలో ఎక్కువగా పేరుకుపోతుందన్న విష‌యం కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంద‌ని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా నడుము, తుంటి చుట్టుకొలత ఎక్కువగా ఉన్న మహిళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉండే అవ‌కాశాలు ఉంటాయ‌ని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం కోసం ఇంగ్లాండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌కు చెందిన 4,79,610 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలో వారి వయస్సు 40 నుంచి 69 సంవత్సరాల మధ్య ఉండగా, సగటు వయస్సు 56 సంవత్సరాలుగా ఉంది. పాల్గొన్నవారిలో ఎక్కువ మంది అధిక బరువుతో ఉన్నప్పటికీ,...