మమతా బెనర్జీ కారుపై రాళ్లతో దాడి..

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారుపై దాడి జరిగింది. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఇటుకలు, రాళ్లతో తన కారుపై దాడి చేశారని, ఈ దాడిలో తృటిలో ప్రాణపాయం తప్పిందని ఆమె తెలియజేశారు. ఈ దాడిని ఆ రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.పోలీసు కస్టడీలో మరణించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్తున్న హాలిసహర్‌లో మార్గంలో బెనర్జీ కారుపై ఒక్కసారిగా దాడులు జరిగాయి. నిరసనకారులు తృణమూల్ అధినేత్రి కారును చుట్టుముట్టి, దానిపై బురద పూసి, బూట్లు, నీళ్ల సీసాలు విసిరినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి....