సాయి సుదర్శన్‌కు గాయం.. రిప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్ ఖాన్?
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు లేనట్లు సమాచారం. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.సాయి సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధనలోనూ పాల్గొంటున్నప్పటికీ.. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమేనని తెలుస్తోంది....