విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఇంటెన్స్ లుక్‌లో టబు !
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్’పై మరోసారి ఆసక్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలోనే విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా నిర్మాణం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. కొంతకాలం పాటు చిత్రబృందం నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో సినిమాపై చర్చ కూడా తగ్గిపోయింది. తాజాగా మేకర్స్ మళ్లీ ప్రమోషన్ మొదలుపెట్టడంతో ‘స్లమ్ డాగ్’ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.