శ్రీచైతన్య స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిపై దాడి
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్‌పై రాత్రి సమయంలో 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మెట్లపై నుంచి కిందపడిపోవడంతో తమ కుమారుడికి గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెంటనే పాఠశాలకు వెళ్లి అభిషేక్‌ను ఇంటికి తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.